జనం న్యూస్ 07 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
రామేశ్వరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసులు మృతి చెందడం పట్ల రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవదర్శనం కోసం వెళ్లిన భక్తులు ఈ పరిస్థితుల్లో మృత్యువాత పడటం అత్యంత దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వం వారి వెంట ఉంటుందని పేర్కొన్నారు.


