జనం న్యూస్ డిసెంబర్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండలం రాష్ట్రంలో రాబోయేది బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని తహరాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామ మాజీ సర్పంచ్ జిన్న రాజేందర్ గండ్ర వెంకట రమణారెడ్డి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన చేస్తుందని వెల్లడించారు. ప్రజలు కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలతో కలిసి ప్రతిపక్షంగా ప్రభుత్వం చేస్తున్న అరాచకత్వాలను ఎండ గడుతూ ఇక్కడికక్కడ నిడదీస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహరాపూర్ గ్రామ మాజీ ఎంపీటీసీ గొట్టిముక్కుల స్వాతి విష్ణువర్ధన్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు రేణికుంట్ల సుమన్, బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ, గ్రామ సర్పంచి అభ్యర్థి గాజు దేవిక దేవేందర్ మాజీ సర్పంచ్ జిన్న రాజేందర్, మాజీ ఉప సర్పంచ్ పాకాల ప్రతాపరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు కొమ్ముల మల్లయ్య,రాకేష్,రేణుకుంట్ల ఐలయ్య, భరత్, మొగిలి, ముక్కెర సదానందం, కొమ్ముల సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు….


