జనం న్యూస్ డిసెంబర్ 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీకాట్రేనికోన
మండలంలోని నడవపల్లి గ్రామంలో ఉన్న ప్రాచీన హరి హర క్షేత్ర ము అయిన శ్రీ కోదండ రామస్వామి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ ఉమారామలింగేశ్వరస్వామి వార్ల ఆలయంలో ఆరుద్ర నక్షత్ర యుక్త ఆరుద్రోత్సవ ము సందర్భంగా ప్రధాన అర్చకులుభైరవభొట్ల మాచారి బ్రహ్మాజీ వారి పర్యావేక్షణ లో ఈరోజు సామూహికంగా శ్రీ రామలింగేశ్వర స్వామివారికి అన్నాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. .ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పంచామృతస్నానం అర్చకులు మరియు పూజ్యం విశ్వనాథ శర్మ అధ్వర్యం లో ఋత్విక్కులు తో మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి అన్నాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉమారామలింగేశ్వరస్వామి దేవాలయం స్థానిక భక్తులు, గ్రామ పెద్దలు, యువతీయువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవలో భాగస్వాములయ్యారు గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.కార్యక్రమం విజయవంతం కావడానికి గ్రామ యువకులు, మహిళ మండలి, భక్తులు సమిష్టిగా సహకారం తో విజయవంతం జరిగింది. అనంతరం భక్తులకు నైవేద్య ప్రసాదాన్ని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా స్థానికులు ఇలాంటి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.




