జనం న్యూస్ డిసెంబర్ 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ41
రోజులశైవాగమ దీక్షతో పిడపర్తి గ్రామం లో జరుగుతున్న కోటి బిల్వార్చనలో భాగంగా 37వ రోజు అతిథిగా పాల్గొన్న ఆలమూరు పండితుడికి విశేష సత్కారం.. తూర్పుగోదావరి జిల్లా పెడపర్తి గ్రామం శివాలయంలో సత్సంగ సార్వభౌమ ఇత్యాది బిరుదాంకితులైన బ్రహ్మశ్రీ యలమంచిలి కృష్ణమూర్తి శివాచార్య వారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతులైన చింతకాయల అయ్యన్నపాత్రుడు వారి దంపతుల సంపూర్ణ యాజమాన్యత్వంలో 41 రోజుల దీక్షతో జరుగుతున్న కోటి బిల్వార్చనలో భాగంగా ఈ రోజు ది 6-12-2025 వతేది శనివారం 37వ రోజు అతిథి గా పాల్గొన్న ఆలమూరు పండితుడైన బ్రహ్మశ్రీ కాళ్లకూరి సూరిపండు శివాచార్య వారికి విశేష సత్కారం జరిపిరి…




