జనం న్యూస్ డిసెంబర్ 7జహీరాబాద్ నియోజకవర్గం
మొగడంపల్లి మండల్‌లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కృపాసాగర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేయడంతో పాటు ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ సందర్భంలో నాయకులు మాట్లాడుతూ, కృపాసాగర్ సామాజిక సేవలో ముందుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారని, ఆయన నాయకత్వంలో మండల అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. యువతకు ఆదర్శంగా నిలిచేలా ప్రజల కోసం సేవభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, యువ నేతలు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పేదలకు ఫలాలు, బట్టలు పంపిణీ చేశారు.




