Listen to this article

జనం న్యూస్, డిసెంబర్ 08,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం పూడిమడక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 2002-03 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన 15మంది విద్యార్థులు రాంబిల్లి మండలం లోవపాలెం గ్రామంలో ఒకరినొకరు కలుసుకుని ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆప్యాయంగా నాడు చదువుకున్న రోజులను గుర్తుకు తెచ్చుకొని ఒకరినొకరు తమ యొక్క ఆనందాన్ని పంచుకున్నారు. ఒక్కొక్కరి జీవన స్థితిగతులు మరొకరు తెలుసుకొని వారి వారి స్థాయిలను బట్టి వారి యొక్క ఆప్యాయతలను పంచుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కుశల ప్రశ్నలు, జోకులతో చిన్నతనాన్ని నెమరు వేసుకుని సంతోషంగా గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పూడిమడక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.