జనం న్యూస్ డిసెంబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన,
ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక ( జేఏసీ) పిలుపు మేరకు సోమవారం కాట్రేనికోన డిసిసిబి బ్యాంక్ వద్ద ఉద్యోగులుధర్నా చేశారు. దీర్ఘ కాలంగా ఉన్న సమస్యపై సుదీర్ఘ పోరాటం చేస్తున్నాం. అయినా ప్రభుత్వాలు మారినా కూడా మా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉంది. విధినిర్వహ కోసం రాత్రి, పగలు కష్టపడ్డా ఆరోగ్యాలు దిబ్బ తిన్నా, రైతు కి అందుబాటులో ఉంటున్నాము. అయినా మా మొర ఎవ్వరూ అలకించడం లేదని కందికుప్ప సీఈఓ య ర్రంశెట్టి రామచంద్ర రావు అన్నారు.వారి డిమాండ్లను వివరించారు.1) జీ ఓ నెంబర్ 36 ప్రకారం వేతన సవరణ 2 ) గ్రాట్యుటీ చట్టప్రకారం అమలు చేయాలని కోరడం 3) ఉద్యోగుల వయోపరిమితి 62 సం కి పెంపు చేయాలని కోరడం 4) 2019 తరువాత నియమించిన సిబ్బందిను పర్మినెంట్ చేయాలని కోరడం తదితర అంశాలపై ఆందోళన చేస్తున్నాం, కావున ప్రభుత్వం రాష్ట్ర సహకార బ్యాంక్ ( అప్కాబ్) స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోఅప్పారీ సత్య ప్ప్రే మేశ్వర రావుపీ. వరహాల రాజువిత్తనాల శంకర్ గుత్తుల వెంకట శ్రీనివాస్ గుబ్బల నాగేంద్ర కుమార్ అక్కల కిరణ్, యర్రంశెట్టి నాని గొల్లపల్లి శ్రీనివాసరావు జొన్నాడ వెంకటేష్ కురసాల సురేష్తదితరులు పాల్గొన్నారు )


