జనం న్యూస్ డిసెంబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీకాట్రేని కోన
గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా కనకేశ్వర స్వామి వారికి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లక్ష పత్రి పూజా మహోత్సవం. భక్త శ్రీ గ్రంధి నాగేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ ఉమా కనకేశ్వర స్వామి వారికి లక్షపత్రి పూజా మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బ్రహ్మశ్రీ ఆణి విళ్ళ ఫణికాంత్ శాస్త్రి ఆధ్వర్యంలో 11 మంది పురోహితులచే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా విఘ్నేశ్వరుని పూజ, రిత్విక్వరుణ, మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, శత సహస్ర బిల్వార్చన, అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, జ్యోతిర్లింగా అర్చన, నీరాజనం మంత్రపుష్పాలు, వేద స్వస్తి ఆశీర్వచన కార్యక్రమాలు, పండిత సత్కారం ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో గ్రంధి బ్రహ్మాజీ, శ్రీమణి దంపతులు, పచ్చిగోళ్ళ వెంకటరాజు శ్రీవల్లి దంపతులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గ్రంధినాగేశ్వరరావు వారి మనవరాలు చిరంజీవి హేమశ్రీ పుట్టినరోజు సందర్భంగా మరియు ఆరుద్ర నక్షత్రం పర్వదినం సందర్భంగా శ్రీ స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం కూడా గ్రంధి నాగేశ్వరరావు గారు వారి కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు.



