.జనం న్యూస్ డిసెంబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ముమ్మిడివరం ఉప మండల పరిధిలోశ్రీ పెన్మత్స జగ్గప్ప రాజు అధ్యక్షతన జరిగిన హిందూ సమ్మేళనంలో శృంగవృక్షం పంచమ పీఠాధిపతి పూజ్య శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామిజీ పాల్గొని అనుగ్రహ భాషణం చేస్తూ హిందూ సమాజాన్ని సంఘటితం చేయవలసిన అవసరం ప్రతి హిందువుపై ఉందన్నారు.ధర్మాన్ని సత్యాన్ని ఆచరించాలని ప్రబోధించేది హిందుత్వం మాత్రమే అని, విశ్వశాంతి కోసం, లోక కళ్యాణం కోరుకునేవారు హిందువులని అని హితవు పలికారు. ముఖ్య అతిథి తాడి నరసింహారావు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా నిలిచిందని తెలిపారు.ప్రథాన వక్త గా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ స్టేట్ సెక్రటరీ అత్తిపట్ల వేణుగోపాల్ నాయుడు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వ్యక్తి నిర్మాణం చేసి దేశానికి సేవ చేసే సంస్థగా నిలిచిందని, పంచ పరివర్తన ద్వారా సమాజ మార్పు లక్ష్యమని తెలిపారు. సమాజంలో అన్ని రకాల బేధ భావాలను రూపుమాపి సమరసతో కూడిన ఆచరణ, పర్యావరణ అనుకూలమైన జీవన విధానం, విలువలు పునాదిగా కలిగిన కుటుంబ వ్యవస్థ ,స్వదేశీ జీవనశైలి మరియు పౌరవిధులను ఆచరించే సమాజాన్ని నిర్మాణం చేయాలని సంకల్పం చేయటం మన కర్తవ్యం. శక్తివంతమైన ఆదర్శ హిందూ సమాజం నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని చెప్పారు.సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా హిందూ సమాజమే ఇలాంటి హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తుందని తెలిపారు.పె ఈ కార్యక్రమంలో పెన్మత్స జగ్గప్పరాజు, తాడి నరసింహారావు, దంగుడు బియ్యం శ్రీనివాసరావు, పెన్మత్స కృష్ణంరాజు, గొలకోటి వెంకట రెడ్డి, ఆదిరాజు సతీష్, పుల్లెల వెంకట నరసింహ శాస్త్రి , సన్నిధి రాజు వీరభద్ర శర్మ,ఎస్ఎస్ఎఫ్ ముమ్మిడివరం ఖండ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు, ఏలూరి రాంబాబు, నంద్యాల నరసింహస్వామి, సలాది శ్రీనివాసరావు, తట్టపర్తి నాగరాజారావు,బొక్కా లక్ష్మీనారాయణ, కర్రి కృష్ణమూర్తి, కడలి వెంకటరమణ, కుడుపూడి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



