జనం న్యూస్ 08 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ
ఉత్తరధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్లో అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు.రూ.17,050 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. జిల్లాలో 9,630 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉండగా, తక్షణ ప్రాధాన్యంగా 339.68 ఎకరాలు అవసరమని చెప్పారు.


