జనం న్యూస్ 08 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాల రూపంలో మృత్యువు వెంటాడుతోంది. శనివారం రామేశ్వరం వద్ద జరిగిన ప్రమాదంలో జిల్లాకు చెందిన నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో దత్తిరాజేరు (మండలం) కొత్తవలసకి చెందిన అప్పలనాయుడు పెళ్లి అయిన నాలుగేళ్లకే చనియాడు. అయితే ఆయన సోదరి అప్పలనరసమ్మ కొన్నేళ్ల క్రితం చెన్నైలో.. మేనమామ కుమారుడు విశాఖలో లారీ ఢీకొనడంతో చనిపోయారు. ఇప్పుడు అప్పలనాయుడి మృతితో ఆ ఇంట రోదనలు మిన్నంటాయి.


