జనం న్యూస్ 08 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
పెందుర్తిలోని సుజాతనగర్ లో మహిళను కుర్చీతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.శ్రీకాకుళానికి చెందిన దేవి, విజయనగరానికి చెందిన శ్రీనివాస్ సుజాతనగర్లో రూమ్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఇద్దరి మధ్య శనివారం రాత్రి వివాదం చోటుచేసుకోగా ఆమెను హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల శ్రీనివాస్పై రైస్ పుల్లింగ్ కేసులో అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు.


