(జనం న్యూస్ 8 డిసెంబర్ భీమారం ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు, కాసిపేట రవి )
నర్సింగాపూర్:గ్రామ సమీపంలోని బస్టాండ్ సమీప వాగులోపులి సంచరిస్తుందనే సమాచారం గ్రామస్తుల్లో భయాందోళనలు రేపుతోంది. అర్ధరాత్రి సమయంలో బస్టాండ్ వెనుకభాగంలో పులి అడుగుజాడలు కనిపించాయని స్థానికులు తెలుపుతున్నారు. , అడవి ప్రాంతం గ్రామానికి కొద్ది దూరంలో ఉండటంతో, వన్యప్రాణులు తరచూ కనిపిస్తున్నా, మొదటిసారిగా పులి బస్టాండ్ వరకు రావడంతో ప్రజల్లో ఆందోళన పుట్టింది. ఈ విషయంలో అడవి శాఖ అధికారులు వెంటనే స్పందించారు, పులి కదలికలను గుర్తించేందుకు కెమెరాలు ఏర్పాటు చేసి గస్తీ బలపరచాలని గ్రామస్తులు అటవీ అధికారులను కోరారు


