Listen to this article

భద్రాద్రి కొత్తగూడెం 08 డిసెంబర్( జనం న్యూస్)

కొత్తగూడెం పట్టణానికి చెందిన తెలంగాణ పత్రిక రిపోర్టర్ ఆర్.సి. కొప్పుల రమేష్ అనారోగ్యంతో మృతిచెందిన ఘటన స్థానిక మీడియా వర్గాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆయన పార్థివదేహాన్ని సందర్శించి బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు కురిమెళ్ల శంకర్, తెలంగాణ పత్రిక జిల్లా స్టాపర్ వీరప్రోలు రాఘవులు, బీసీ నాయకుడు మెట్టల సైదుబాబు ప్రగాఢ నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు కురుమల శంకర్ మాట్లాడుతూ, రమేష్ జర్నలిజం రంగంలోనే కాకుండా ఎమ్మార్పీఎస్ కార్యకలాపాల్లోనూ చురుకైన పాత్ర పోషించారని తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, నిజాయితీతో పనిచేసిన సామాజిక కార్యకర్తగా రమేష్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
రమేష్ మరణం స్థానిక జర్నలిస్టుల సంఘం, రాజకీయ వర్గాల్లో పెద్ద నష్టంగా భావిస్తున్నారు.