Listen to this article

అచ్యుతాపురం(జనం న్యూస్):బ్రాండిక్స్ కార్మికులకు 15 వేలు వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము, మండల కార్యదర్శి కె సోము నాయుడు డిమాండ్ చేశారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న మహిళలకు అండగావున్న సీఐటీయూ నాయకుల అక్రమ అరెస్టులు,నిర్బంధ చర్యలు అపాలన్నారు. అచ్యుతాపురం సెంటర్ లో ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తూ సీఐటీయూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ తిమ్మరాజుపేట, మోసయ్యపేట,భోగాపురం, పూడిమడక సీఐటీయూ నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు తిరిగి పూడిమడక మత్స్యకార్మిక సంఘం నాయకులు చేపల తాతయ్యను పోలీస్ స్టేషన్ కు తరలించి భయానక, నిర్బంధ వాతావరణం సృష్టిస్తోందని అన్నారు. ప్రభుత్వం మహిళల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వేతన, ఇతర సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి చొరవ చూపాలని హెచ్చరించారు.
గార్మెంట్స్ వర్కర్ల జీతాలకు సంబంధించిన జీఓ సవరించి ప్రస్తుత ధరలకు అనుగుణంగా వేతనాలు నిర్ణయించి అమలు చేయించాలన్నారు.
ఈ కార్యక్రమంలో చింతకాయల శివాజీ, చందక రామకృష్ణ,ఆర్ లక్ష్మి, దూలి వెంకయ్య నాయుడు, ఒడిసెల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.