Listen to this article

జనంన్యూస్ డిసెంబర్ 08 సంగారెడ్డి జిల్లా

పటాన్ చేరు మండలంలో ఈ నెల 11న జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తూ బీడీఎల్ భానూర్ సీఐ విజయ్ కృష్ణ సమక్షంలో పోలీసులు నందిగామ గ్రామంలో ప్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరగకుండా,శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరగేందుకు ప్రతి అభ్యర్థి, కార్యకర్తలు సహకరించాలని సీఐ విజ‌య్ కృష్ణ కోరారు. నందిగామ గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎన్నికలకు సంబంధించిన పలు సూచనలు, సలహాలు అందించారు. గ్రామంలో శాంతి–భద్రతలు కాపాడే దిశగా పోలీస్ విభాగం ప్రతి చర్య తీసుకుంటుందని అధికారులు తెలిపారు