జనం న్యూస్: డిసెంబర్ 8 సోమవారం; సిద్దిపేట నియోకికవర్గ ఇన్చార్జి వై రమేష్ ;
పద్యం పదికాలాల పాటు నిలుస్తుందని అవధాని తిరుకోవళ్ళరూర్ శ్రీహ్ష అన్నారు. ధారణతో కూడిన అవధానం తెలుగు సాహిత్యంలోనే ఉందన్నారు. సిద్దిపేటలోని హరిహర రెసిడెన్సి సమీపంలో గల లలిత చంద్రమౌళీశ్వర క్షేత్రం మాస ఉత్సవాలను పురస్కరించుకొని పూజలు, హోమాలు, వైధిక కార్యక్రమాలతో పాటు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పృచ్చకులుగా నిషిద్ధక్షరి కంది శంకరయ్య, అశువు ఉండ్రాళ్ళ రాజేశం, దత్తపది శాంతి, వర్ణన నల్ల అశోక్, అప్రస్తుతం తాటికొండ శివకుమార్, సమస్య భార్గవి, ఛందోభాషణం సింగీతం నరసింహరావు తదితరులు అడిగిన అంశాలపై అవధాని
అవధాని శ్రీహర్ష అష్టావధానంతో అలరించి, పద్యధారణ చేశారు. ఇట్టి అష్టావధాన కార్యక్రమంలో నిర్వాహకులు పండరి రాధకృష్ణ, భావన, కవులు వేణుమాధవశర్మ, కాల్వ రాజయ్య సాహితీ ప్రియులు హాజరై విజయవంతం చేశారు.


