Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పరకాల ఏసిపి సి సతీష్ బాబు అన్నారు. మండలంలోని ఏంజెపి బాలుర పాఠశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపి సతీష్ బాబు మాట్లాడుతూ ఇటీవల జరుగుతున్న సైబర్ నేరలను దృష్టిలో ఉంచుకొని వరంగల్ కమీషనరేట్ ఎలాగైనా ఇట్టి నేరలను ఆపాలనే ఉద్దేశ్యం తో తీసుకున్న ఆలోచన ప్రకారం తీసుకువచ్చిన సైబర్ సారధి 1930, ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ అనే ప్రోగ్రామ్ తో ప్రజలకు అవగాహనా కల్పించాలని ఎం జె పి బాలుర పాఠశాల లో అవగాహనా సదస్సు నిర్వహించారు అన్నారు. పిల్లలకు సైబర్ క్రైమ్ ,హెల్ప్ లైన్,, గోల్డెన్ అవర్ ,రిపోర్టింగ్, ఫ్రాడ్ లింక్స్ , ఓటీపీ షేరింగ్ ,గురించి తెలిపి ఇట్టి వాటిపై జాగ్రత్తగా ఉండాలని పిల్లలని హెచ్చరించినారు .ఈ కార్యక్రమంలో సి ఐ గోపి సి సి ఎస్ ,శాయంపేట సీఐ పి రంజిత్ రావు ,ఎస్సై జక్కుల పరమేశ్వర్ పోలీస్ సిబ్బంది ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు….