Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్

కృష్ణఅనకాపల్లి లో మండల రెవెన్యూ కార్యాలయాలు,కోర్టు భవనాలు యుధ్ధ ప్రాతిపదికన నిర్మాణం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు.ఒకప్పుడు ఎపనికైన విశాఖపట్నం వెళ్లవలసి వచ్చేదని, దాని వలన డబ్బు, సమయం వృధా అయ్యేదని, 2019 వైఎస్ ఆర్ ప్రభుత్వం వచ్చిన సం”లోనే అనకాపల్లినిజిల్లాగా ఏర్పాటు చేసి, అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, సచివాలయం, వాలెంటరీ వ్యవస్థలతో నేరుగా ప్రజలు వద్దకే పాలన ఏర్పాటు చేసిన నాయకుడు జగన్మోహన్రెడ్డి అని గుర్తు చేశారు. అనకాపల్లి ఎం.ఆర్.ఓకార్యాలయం శిధిలావస్థకు చేరుకుని ఎప్పుడూ పడిపోతుందో అన్న పరిస్థితిలో ఉందని, గత నెలలో వచ్చిన మోంధ తుఫాన్కు ఉద్యోగులు పనిచేయడానికి భయం, వేసింది అతి ముఖ్యమైన రికార్డులు తడిసిపోయే పరిస్థితిలో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని, రోజూఆఫీస్ పనిపై వందలాది మంది వస్తారని, వారి క్షేమం చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది కాదా అని సూరిశెట్టి ప్రశ్నించారు.అనకాపల్లి కోర్టు లో కక్షిదారులు పెరుగుట వలన యిప్పుడున్న భవనము చాలకచాలా మంది యిబ్బంది పడుతున్నారన్నారు.సుమారు వంద కోట్లు విలువ చేసే కోర్టు, ఎం.ఆర్.వో కార్యాలయ , ప్రభుత్వస్వంత స్థలాలు అనకాపల్లి నడిబొడ్డున ఉండగా, ప్రభుత్వం నూతన భవనాలు కట్టకపోవడం శోచనీయం.13 వ ఆర్ధిక సంఘ నిధులు 214 కోట్లు యిస్తున్నట్లు ప్రకటించిందని, దానిలో జిల్లాకు వచ్చే నిధులలో కోర్టు,ఎం.ఆర్.ఓ. భవనాలు నిర్మించాలని రమణ అప్పారావు కోరారు.//