Listen to this article

జనం న్యూస్‌ 09 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

ఒక్క డీ ఎస్ సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వని ఐదు సంవత్సరాల పాలనపై గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి గారూ!
ఉపాధ్యాయులు లేక బోధన స్థంభించిన పాఠశాలలు మీకే గుర్తు చేయాలా? ‘నాడు–నేడు’ పేరుతో గోడలకు రంగులు వేసి బిల్లులు చెల్లించకుండా వదిలేయడం — అదే మీ ప్రభుత్వం! గిరిజన ప్రాంతాల్లో 66 చిన్నారులు చనిపోయినప్పుడు ఒక్కరి ఇంటికైనా వెళ్లారా? బాధ్యత ఏదైనా తీసుకున్నారా? ‘అమ్మ ఒడి’ని ఇద్దరికి ఇస్తానని చెప్పి చివరకి ఒక్కరిని మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం .గత బకాయిలు:ఫీజు రీయింబర్స్‌మెంట్ ₹107 కోట్ల క్లియరెన్స్ మెయింటెనెన్స్ ₹28.40 కోట్లు డైట్ ఛార్జీలు ₹105 కోట్లు
ఇవన్నీ మా ప్రభుత్వం క్లియర్ చేసింది! ఉద్భవ్–2025 జాతీయ వేడుకకు గిరిజన శాఖ మంత్రిగా నేను వెళ్తే… మీకెందుకు కడుపుమంట? 22 రాష్ట్రాలు, 45 ఇ ఎం ఆర్ ఎస్ స్కూళ్లు, 1800 విద్యార్థులతో ఇంత భారీ గిరిజన సాంస్కృతిక ఉత్సవం — మీ పాలనలో జరగలేదంటే తెలివితక్కువ పాలనకే సంకేతం! మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి: 1.42 లక్షల విద్యార్థులకు ట్రంక్ పెట్టెలు ₹5.85 కోట్ల స్టీల్ ప్లేట్లు
₹6.65 కోట్ల క్రీడా కిట్లు ₹12.45 కోట్ల స్టేషనరీ 2,000 కొత్త టాయిలెట్లు 42 పాఠశాలల మరమ్మతులకు ₹155 కోట్లు
గిరిజన ప్రాంత రహదారులు, భవనాలకు ₹1300 కోట్లు ఈ అభివృద్ధి చూసి అసహనంతో మండిపడుతున్న వైసీపీ నాయకులు గుర్తుంచుకోండి — దేవుడి సొమ్ము దొంగిలించేవాళ్లకు, గోమాతలకు రక్షణ కరువు చేసేవాళ్లకు ప్రజల తీర్పే పెద్దదైవం!