Listen to this article

అచ్యుతాపురం(జనం న్యూస్): మండలం లోని మత్స్యకార గ్రామమైన పూడిమడక రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాలను పలు చోట్ల కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని దుకాణాలు ఏర్పాటు కోసం ముందుకు వెళ్తున్న పంచాయతీ యంత్రాంగం తమకు ఏమి తెలియనట్లు పట్టించుకోకుండా ఉండటం పట్ల స్థానికుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూడిమడకలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించికున్న వారి పై చర్యలు తీసుకుని ఆ స్థలాలను పంచాయతీ వారు స్వాధీనం చేసుకోవాలని డిజిటల్ అసిస్టెంట్ సలీమ్ కు మత్స్యకార యువకులు
వాసుపల్లి రాజేష్ ,ఉమ్మిడి సత్తిబాబు,గంగరాజు
ఫిర్యాదు చేశారు.