Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మండల కేంద్రంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో డిసెంబర్ 9 2009న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష విరమించి తెలంగాణ ప్రకటన వచ్చే విధంగా చేసిన సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వృద్ధులకు మహిళలకు పండ్ల పంపిణీ చేశారు అనంతరం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూతుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడ్డ రోజు డిసెంబర్ 9 విజయ దివాస్ గా పరిగణించుకోవాలిసబ్బండ వర్గాల పోరాటం, అమరుల త్యాగం, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి నేటికి 16 సంవత్సరాలు నవంబర్ 29 (దీక్షా దివస్) లేకుంటే డిసెంబర్ 9 (విజయ్ దివస్) లేదు… డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు. అని తెలిపారు కేవలం కేసిఆర్ పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని తెలిపారు కాంగ్రెస్ నాయకుల మాయ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఏమీ తెలంగాణ రాష్ట్రం ప్రకటించలేదని కేసిఆర్ దీక్ష పోరాటం వల్లనే తెలంగాణ ప్రకటన విడుదలైందని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పొడిశెట్టి గణేష్ మండల నాయకులు పరకాల మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మారేపల్లి నందం సీనియర్ నాయకులు బాసాని వెంకటేశ్వర్లు కూతాటి రమేష్ జిల్లా యువజన నాయకులు పెంబర్తి వినయ్ పెద్దిరెడ్డి కృష్ణారెడ్డి పెంబర్తి అఖిల్ రమేష్ గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు…..