జనం న్యూస్ డిసెంబర్ 9 జగిత్యాల జిల్లా
బీరుపూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో జగిత్యాల సి ఐ అధ్వర్యంలో బీర్పూర్ పోలీసుల శాంతి కవాతుప్రస్తుతం జరుగుతున్న గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రజల్లో భరోసా కల్పించడానికి నిర్భయంగా ఓటు వేసేందుకు బీర్పూర్ మండలంలో పోలీసులు శాంతి కవాతు నిర్వహించారు. మండలంలోని బీర్పూర్ నందు తెలంగాణ తల్లి విగ్రహం నుండి శాంతి స్థూపం వరకు గ్రామ వీధుల వెంట మరియు తుంగూరు గ్రామంలోని ప్రధాన వీధుల వెంట శాంతి కవాతును జగిత్యాల రూరల్ సీఐ దామెర సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీర్పూర్ ఎస్సై రాజు, జగిత్యాల రూరల్ ఎస్సై ఉమాసాగర్, రాయికల్ ఎస్సై సుధీర్ రావు సారంగాపూర్ ఎస్సై గీత మరియు సర్కిల్ పోలీస్ సిబ్బంది శాంతి కవాతులో పాల్గొని ప్రజల్లో చైతన్యం నింపారు. శాంతి కవాతు ముగింపులో భాగంగా ప్రజలను సమావేశపరిచి ఎన్నికల ప్రవర్తన నియమావళిని , పోలింగ్ రోజు పౌరులు ఇక్కడ పాటించవలసిన నియమాలను బాధ్యతలను పోలీసులు తెలియజేశారు




