Listen to this article

.జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 9తర్లుపాడు

మండలం తుమ్మలచెరువు మరియు జగన్నాధపురం గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. రైతన్న మీకోసం కార్యక్రమం తదుపరి మరల పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. రబి పంటలైన మినుము, మొక్కజొన్న, పొగాకు మొదలగు పంటలను ప్రతి రైతు ఈక్రాప్ నమోదు చేయించుకోవాలని తెలియజేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రం మీర్జా పేట రైతు సేవ కేంద్రం నందు ప్రారంభించినందున వరి ధాన్యం అమ్మదలుచుకున్న రైతులు వారి యొక్క రైతు సేవ కేంద్రం సిబ్బందిని సంప్రదించి వారి లాగిన్ లో షెడ్యూల్ చేయించుకోవలసినదిగా తెలియజేశారు లేదా రైతులే స్వయంగా వాట్సాప్ ద్వారా షెడ్యూల్ చేసుకోవాల్సిందిగా సూచించారు. వరి ధాన్యం గ్రేడ్ ఏ రకం క్వింటాకు ప్రభుత్వ మద్దతు ధర రూ 2389 గా నిర్ణయించినట్లు వారికి తెలిపారు. సాధారణ వరి క్వింటాలుకు రూ 2369 గా నిర్ణయించారని తెలిపారు. అనంతరం రైతులతో మొక్కజొన్న మరియు మినుము పొలాలను పరిశీలించారు. మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులు తప్పనిసరిగా కంపెనీ వారి వద్ద నుండి అగ్రిమెంట్లు పొందాలని తెలిపారు. మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు మరియు జింకు లోపాలను గుర్తించి వాటి నివారణ చర్యలు రైతులకు తెలియజేశారు. మొక్కజొన్న పంటకు ఎకరాకు 19:19:19 కేజీ చొప్పున పిచికారి చేసుకోవాలని దానితోపాటు జింక్ లోపం నివారించుకోవడానికి చిలేటెడ్ జింక్ పిచికారి చేసుకోవాలని రైతులకు సూచించారు. కత్తెర పురుగు నివారణకు ఏమామెక్టిన్ బెంజోయేట్ లేదా కోరాజిన్ పురుగుమందును పిచికారి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ దేవేంద్ర గౌడ్ గ్రామ వ్యవసాయ సహాయకులు మల్లికార్జున్,గ్రామ రైతులు పాల్గొన్నారు.