ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
జనం న్యూస్, డిసెంబర్ 09,అచ్యుతాపురం:
అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ కేంద్రమైన యలమంచిలి మండలం లైన్ కొత్తూరు వద్ద గల అగ్రిగోల్డ్ సైట్ లో నియోజకవర్గ కూటమి కుటుంబ సభ్యులందరికి స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్,ఉత్తరాంధ్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ముఖ్య ప్రతినిధి సుందరపు సతీష్ కుమార్ వన సమరాధన ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త నా సొంత అన్నదమ్ముడితో సమానమని, 18 నెలల పాలనలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని,
టిడిపి,బీజేపీలతో కలిసి పనిచేస్తున్నామని,త్వరలోనే ఈఎస్ఐ ఆసుపత్రి ప్రారంభోత్సవం ఉంటుందని,
6 నెలల్లో అచ్యుతాపురం-అనకాపల్లి రోడ్డు పూర్తి అవుతుందని, అవకాశాలు ఉన్నచోట అభివృద్ధి జరగాలనేదే నా ఆకాంక్ష అని, గూగుల్ సెంటర్ కి మొట్టమొదటిగా భూములు ఇచ్చామని,మన నియోజకవర్గంలో ఆర్ఎండ్ఆర్ సమస్యలు ఎక్కువున్నప్పటికి…అన్నింటినీ అధిగమించుకుని పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటునందిస్తున్నామని,వైసీపీ నాయకులు ఎన్ని అవాకులు,చవాకులు మాట్లాడిన నేను పట్టించుకోనని,
నేను పుట్టిన ఈ నియోజకవర్గ అభివృద్ధికి సేవ చేసుకునే అవకాశాన్ని 2024 ఎన్నికల్లో మీరందరూ ఇచ్చారని,
మీ ప్రతినిధిగా నేను పనిచేసుకుంటూ వెళ్తానని,పరిశ్రమలు రావాలన్నా,నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా రహదారులు బాగుండాలని,దానితో పాటుగా అనుసంధానం జరిగి ఉండాలని,అందుకే నియోజకవర్గంలో తొలి ప్రాధాన్యత రహదారుల నిర్మాణానికి ఇవ్వడం జరిగిందని, ముఖ్యంగా అచ్యుతాపురం కూడలి విస్తరణ,ప్లై ఓవర్ పనులు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిఫికేషన్,డ్రైనేజీలపై దృష్టి పెట్టామని,నియోజకవర్గంలో గల నాలుగు మండలాలను అభివృద్ధి చెందించేందుకు అత్యుత్తమ ప్రణాళికలు రచించుకున్నామని,ఇళ్ల స్థలాల విషయంలో ఎన్డీయే నేతలు, అధికారులు చర్చించుకుని, అర్హతలున్న వారికి వచ్చేటట్టు కార్యక్రమాన్ని రూపొందిస్తారని,జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో గల ఎన్టీఆర్ ఆసుపత్రిలో డెలివరీల కోసం మహిళలు వేచి ఉండటం చూసి, చలించిపోయి,మానవతా దృక్పథంతో సిఎస్ఆర్ నిధులతో ఎన్టీఆర్ ఆసుపత్రిలో అదనపు డెలివరీ గదుల నిర్మాణానికి పూనుకున్నామని,నా దగ్గరకు వచ్చిన ప్రతీ కార్యకర్తకు వారికి కావాల్సిన పనిని చేస్తున్నామని,ప్రతీ ఒక్కరూ నాకు సమానమేనని అన్నారు.ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ పిల్ల రమా కుమార్ కూటమి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



