Listen to this article

భద్రాద్రి కొత్తగూడెం క్రైమ్ 09: డిసెంబర్( జనం న్యూస్)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ హత్య కేసులో జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. కొత్తగూడెం గణేష్ బస్తీకి చెందిన కేతేపల్లి సురేష్ తన ఫిర్యాదులో, తన తమ్ముడైన సుధాకర్ వారి కుటుంబంతో జీవిస్తూ వ్యాపారం చేసుకుంటూ గణేష్ బస్తీలో నివాసం ఉంటున్నాడని, 2021 సెప్టెంబర్ 8 న రాత్రి వారి మరదలు ప్రమీల ఫోన్ చేసి తన తమ్ముడు ఇప్పుడే వస్తానని టీఎస్ 28 ఇ 8023 అనే మోటార్ సైకిల్ పై వెళ్లి ఇప్పటివరకు తిరిగి రాలేదు అని చెప్పగా, చుట్టుపక్కల వెతికార నీ,తెలిసిన బంధువులను అడిగారని ఎక్కడ కనిపించలేదు. మరుసటి రోజు 9/ 9 /2021న ఎదురుగడ్డ గ్రామపంచాయతీ పరిధిలో గల చిప్ప ముత్తిలింగం కాలనీ దగ్గర ఖాళీ ప్రదేశంలో ఒక వ్యక్తి చనిపోయినార ని తెలిసి మేము వెళ్లి చూసేసరికి అక్కడ తన తమ్ముడు సుథాకర్ చనిపోయినట్లుగా గుర్తించారని , అతనినీ పరిశీలించి చూడగ తలపైన రక్తగాయాలు ఉన్నాయని లక్ష్మీదేవి పల్లె పోలీస్ స్టేషన్లో అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ కె .అంజయ్య కు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.గురుస్వామి కేసు దర్యాప్తులో భాగంగా చనిపోయిన వ్యక్తి ఫోన్ కాల్ రికార్డు ఆధారంగా లక్ష్మీదేవి పల్లి మండలం చాతకొండకు చెందిన షేక్ బాషా క్రితము సుధాకర్ ను డబ్బులు అడిగితే లేవన్నాడని, స్నేహాన్ని అడ్డం పెట్టుకొని కేతేపల్లి సుధాకర్ ను ఫోన్ ద్వారా పిలిపించి, లక్ష్మీదేవి పల్లి మండలం ఎర్రగడ్డ లోని చిప్ప ముత్తిలింగం జామాయిల్ తోట వద్ద మధ్యగల ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి తులము న్నార బంగారు చైను, తులము గోల్డ్ రింగ్ బంగారం అపహరించి చంపాలని ఉద్దేశంతో ఇనుప గొట్టంతో తల వెనుక భాగంలో కొట్టి చంపి, అట్టి బంగారు వస్తువులను తీసుకొని వెళ్ళాడని, పరిశోధన చేసి దర్యాప్తు అనంతరం షేక్ బాషా పై కోర్టులో ఛార్జి షీట్ దాఖలు చేశారు. కోర్టులో 16 మంది సాక్షులను విచారించారు. చేత కొండకు చెందిన షేక్ పాషాపై నేరం రోజు కాగా, 302 ప్రకారం జీవిత ఖైదు, వెయ్యి రూపాయలు జరిమానా ,379 ప్రకారం మూడు సంవత్సరముల జైలు శిక్ష , ₹1000 జరిమానా, జరిమాణ మొత్తం 2 వేల రూపాయలు చెల్లించవలెన ని, జైలు శిక్ష ఏకకాలంలో అనుభవించాలని తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ ను అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి.లక్ష్మి నిర్వహించారు. సాక్షులను విచారణ కోసం సకాలంలో కోర్టు కు సహకరించిన ప్రస్తుత ఎస్.ఐ. జి.రమణారెడ్డి ,కోర్టు నోడల్ ఆఫీసర్ డి. రాఘవయ్య ,కోర్టు లైజాన్ ఆఫీసర్ ఎన్.వీరబాబు,( కోర్టు డ్యూటీ ఆఫీసర్ )పి . సి. కే.అశోక్ లు సహకరించారు.