Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

కొంతమంది రైతులు తాము రుణాలు పొంది తిరిగి చెల్లించకపోవడంతో డిసిసిబి సిబ్బంది వసూళ్లకు రోడ్డెక్కారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన కాట్రేనికోనలో ప్లకార్డులు చేత పట్టుకుని నినాదాలు చేశారు. రైతులు పొందిన రుణాలను సకాలంలో తిరిగి చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి ఏజీఎం దేశం శెట్టి ఏసుబాబు, కాట్రేనికోన డిసిసిబి మేనేజర్ పీతల శ్రీనివాస్, సీఈఓ లు యర్రం శెట్టి రామచంద్రరావు, అప్పారి ప్రేమేశ్వరరావు, విత్తనాల మూర్తి, కోటిపల్లి ప్రసాద్, కే సీతారామారావు, గుత్తుల శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు