

మహిళలు సమస్యలపై నిర్భయంగా సంప్రదించవచ్చు.
మహిళలు, చిన్నపిల్లలకు చట్టాలపై షీ టీం
భరోసా టీం ద్వారా జిల్లాలో అవగాహన సదస్సుల నిర్వహణ
జనం న్యూస్ పిబ్రవరి 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మహిళలు, యువతులు ఎవరైనా హింసకు గురి అయినట్లయితే నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్ గారు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, చిన్నపిల్లల రక్షణ కోసం షీటీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీం, భరోసా సెంటర్లు పనిచేస్తున్నాయని తెలిపారు. విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యం గా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాల, పాఠశాలల విద్యార్థులకు ర్యాగింగ్, ఈవీ టిజింగ్, ఫోక్సో, షీటీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ పై షీ టీం , భరోసా టీం మరియు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. వీరితోపాటు ఉపాధి హామీ పనికి వెళ్లే మహిళలకు కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. అదేవిధంగా మహిళలు పనిచేసే ప్రదేశాల్లో ఏదైనా హింసకు గురి అయినట్లయితే షీ టీం ని సంప్రదించాలని తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా జనవరి నెలలో షీటీం ద్వారా 86 హాట్స్పాట్ ప్రదేశాలను గుర్తించినట్టు, 15 అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ద్వారా విద్యార్దిని, విద్యార్థులకు అవగాహన కల్పించామని మరియు రెండు పిర్యాదులు స్వీకరించమని, వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. చిన్న పిల్లలు, మహిళల రక్షణ విషయంలో పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపడుతుందన్నారు. మహిళలు సామాజిక మాద్యమాలైన ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఫొటోలు, వీడియోలు పోస్టుచేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించి అన్ని రకాల భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా మహిళలు ,పిల్లలు హరాష్మెంట్ గురి అయినట్లు గమనిస్తే, పోలీసులను నేరుగా సంప్రదించలేని వారు షీ టీం ని సంప్రదించాలని తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా రెండు షి టీమ్ లు పనిచేస్తున్నాయని, *అసిఫాబాద్ డివిజన్ షీ టీం నెంబర్ 8712670564 కాగజ్నగర్ డివిజన్ షీ టీం నెంబర్ 8712670565 లేదా డయల్ 100కు సమాచారం అందించాలని, సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. బాధితులు ఎవరైనా షి టీం మరియు భరోసా సెంటర్ ను సంప్రదించినట్లయితే షీ టీం మరియు భరోసా సెంటర్ సభ్యులు మీ ఇంటికి వచ్చి మీకు తగు న్యాయ, వైద్య మరియు ఇతర సేవా సహకారాలు అందించడం జరుగుతుందని తెలియజేశారు.