నశా ముక్త్ భారత్ అభియాన్ కోఆర్డినేటర్ ఉమేరా
,జనం న్యూస్,డిసెంబర్ 10,
నారాయణఖేడ్,సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నశా ముక్త్ భారత్,కార్యక్రమాన్ని బుధవారం ఇన్చార్జి హెచ్ఎం రాజశేఖర్, ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి యువతరం చెడు అలవాట్లకు బానిసలై తమ జీవితాలను, కుటుంబాలను, సర్వనాశనం చేసుకుంటున్నారని అన్నారు.అందుకు కారణమైన మత్తు మారకద్రవ్యాల నుంచి విముక్తి పొందడానికే నశా ముక్త్ భారత్, కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు.ఈ రోజు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఖేడ్ పాఠశాలలో బాలల హక్కులు,చట్టలపైన, పిల్లల రక్షణ,భద్రత అంశాలు,బాల్య వివాహాలు,బాలల పైన లైంగిక వేదింపులు, బాలికల అక్రమ రవాణా,బాలకర్మిక నిర్ములన,ఫైర్ సేఫ్టీ, విపత్తులు,సైబర్ క్రైమ్, సైబర్ బిల్లింగ్,పైన అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు ఎన్ విట్టల్,జె ప్రకాష్, నశా ముక్త్ భారత్, అభియాన్ కోఆర్డినేటర్ ఉమేరా,నర్సింలు,హేడ్ కానిస్టేబుల్ రవీందర్, పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్,పాఠశాల ఉపాధ్యాయులు రాజయ్య,చంద్ర శేఖర్ ఆచార్య,హమీద్, విద్యార్థిని విద్యార్థులు, పాల్గొన్నారు.


