Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 3.

తర్లుపాడు మండలం కలుజువ్వాలపాడు గ్రామం లో గల కె జి బి వి బాలికల పాఠశాలను, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను డిప్యూటీ సియం కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రం లో అన్ని ప్రభుత్వ పాఠశాలలను సామాజిక తనిఖీ బృందం తనిఖీ చేసి పాఠశాల స్థితిగతుల పై రిపోర్ట్ తయారు చేయాలనీ ఆదేశాల మేరకు ప్రకాశంజిల్లా లో 76 పాఠశాల తనిఖీ బృందం కలుజువ్వాలపాడు గ్రామం లో గల కేజీబివి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను సందర్శించి విద్యార్థుల తో సమావేశం నిర్వహించి పాఠశాల హాస్టల్ లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం పాఠశాల తరగతి గదులను పాఠశాల మొత్తం విద్యార్థులు ఎంత మంది రికార్డ్ ను తనిఖీ చేసారు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేరా అని పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా లెవా అని ప్రశాంత వంతమైన వాతావరణం ఉందా లేదా అనితనిఖీ చేసి విద్యార్థుల తల్లి తండ్రులకు సమావేశం నిర్వహించి సమస్యలను విద్యార్థుల భవిషత్ పై చర్చించారు ఈ కార్యక్రమం లో కెజిబివి ప్రిన్సిపాల్ మాధురి, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిలకపాటి సత్యనారాయణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు