Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

మునగపాక మండలం అరబుపాలెం గ్రామంలో నేడు అనగా గురువారం పండుగ జాతర పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ బొడ్డేడ శ్రీనివాసరావు లక్ష్మి దంపతులు అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రములు సమర్పించారు. తెల్లవారు ఐదు గంటల నుండి మరిడిమాంబఅమ్మవారిని గ్రామ ప్రజలు బంధువులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. జాతర పురస్కరించుకొని గ్రామంలో రాజ్ యూత్ ఆధ్వర్యంలో డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్స్ మరియు బాలవీరుల ఆధ్వర్యంలో సాంఘిక నాటకం మరియు నేల వేషములు భారీ లైటింగ్ లతో ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ మరియు కమిటీ సభ్యులు తెలిపారు. రెండు సంవత్సరములకు ఒకసారి జరిగే ఈ పండుగకు దూర ప్రాంతంలో నుండి బంధువులు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని తెలిపారు.