జనం న్యూస్ 11 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లాంపుర్ తాలుకా అయిజ మండలం ఉప్పల్ గ్రామం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి రెండు సంవత్సరాలు అయితే కూడా గ్రామాలలో అభివృద్ధి శూన్యం బిఆర్ యస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఉప్పల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తరఫున ఇంటింటి ప్రచారంగ్రామాలలో కాంగ్రెస్ నాయకులకు ఓటు అడిగి హక్కే లేదు గ్రామాల అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం. ఈరోజు ఉప్పల గ్రామం అభివృద్ధి జరిగిందంటే అది కేసీఆర్ నాయకత్వం లోనే ఈ రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలకి ఏమీ అభివృద్ధి చేసినారని ఇవాళ మొఖం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నించారు.ఈరోజు ఐజ మండలంలోని ఉప్పల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి జి. తిమ్మప్ప ఉంగరం గుర్తుపైన ఓటు వేసి వేయించి గెలిపించాలని ఇంటింటా ప్రచారంలో పాల్గొని అభ్యర్థించడం జరిగింది.గౌరవ ఎమ్మెల్సీ శ్రీ చల్లా వెంకట్రామిరెడ్డి , అలంపూర్ ఎమ్మెల్యే శ్రీ విజయుడు బలపరిచిన ఉప్పల గ్రామ సర్పంచ్ అభ్యర్థి జి. తిమ్మప్ప ఉంగరం గుర్తు పైన ఓటు వేసి వేయించి భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రార్థించారుఈ సందర్బంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ….ఈరోజు గ్రామం అభివృద్ధి అయింది అంటే అది కెసిఆర్ నాయకత్వమే, ఈరోజు గ్రామంలో డంపింగ్ యార్డ్ అయినా, పల్లె ప్రకృతి వనమైన, స్మశాన వాటికైనా, సిసి రోడ్ల అయిన, ఇంటింటికి నల్ల ఆయన డ్రైనేజీలైన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈరోజు కాంగ్రెస్ సాయం లో జరిగిన అభివృద్ధి శూన్యం.కాంగ్రెస్ పార్టీనీ నమ్మితే నట్టేట మునిగినట్టే.చేసిన అభివృద్ధిని కొనసాగించలేని దుస్థితి కాంగ్రెస్ నాయకులది.12 ఏండ్ల క్రింద ఉప్పల గ్రామం ఎట్లుండే నేడు ఎట్లా ఉందో ప్రజలు భేరిజూ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఓట్లు అడిగే కాంగ్రెస్ నాయకులను ఆసరా పింఛన్లు 4000,మహిళకు 2500,కళ్యాణ లక్ష్మీ ద్వారా తులం బంగారం,విద్యార్థులకు స్కూటీలు, ధాన్యానికి బోనస్,కె.సి.ఆర్ కిట్టు,కంటి వెలుగు పథకాలు ఏవి అని నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ హామీ అమలు చేయలేదు.నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నమాట నెరవేర్చలేదు.రెండేండ్లలో మళ్ళీ బి.ఆర్.ఎస్ అధికారంలోకి వస్తుందని అభివృద్ధి కొనసాగించాలంటే జి.తిమ్మప్ప ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో రవికుమార్ రెడ్డి, మధు గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, కుర్వ జయన్న నాయకులు వార్డ్ మెంబెర్ అభ్యర్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


