Listen to this article

జనం న్యూస్ పిబ్రవరి 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న కోడి గ్రుడ్ల బిల్లులు వేతనాలు చెల్లించాలని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి విద్యాధికారి గమానియకి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు వెలిశాల క్రిష్ణమాచారి గారు మాట్లాడుతూ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెండింగ్లో ఉన్న నవంబర్ నుండీ జనవరి వరకు రాష్ట్ర వాటా వేతనాలు చెల్లించాలని, కొడిగ్రుడ్ల బిల్లులు ఆగస్టు నుంచి జనవరి వరకు ఆరు నెలలు బిల్లులు చెల్లించాలని అలాగే కూరగాయల బిల్లులు చెల్లించాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26000/- ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు సగటున మూడు గుడ్లు పెడితే కేవలం రెండు గుడ్లకే డబ్బులు చెల్లించడం సరైంది కాదని వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి కోడి గ్రుడ్లకు అదనంగా బడ్జెట్ కెటాయించాలని, లేని పక్షంలో అంగన్వాడి కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు కొడిగ్రుడ్లు సరఫరా చేయాలనీ,గ్యాస్ సబ్సిడీ ఇవ్వాలని అంతే కాకుండా అతితక్కువ వేతనాలు చెల్లిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమదోపిడికి గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఇచ్చిన హామీ అదికారంలోకి రాగానే 10వేల రూపాయల వేతనం పెంచి చెల్లిస్తామని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినది కానీ ఇంతవరకు వేతనాలు పెంపుదల చేయలేదు తక్షణమే స్పందించి పదివేల రూపాయల వేతనం చెల్లించి ఈ.ఎస్ ఐ పి ఎఫ్ సౌకర్యాలు కల్పించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకోవవలసింది పోయి. కార్పొరేట్లకు కొమ్ముకాసే విధంగా 2025 కేంద్ర బడ్జెట్ వలన కార్మికులకు ఒరిగేదేమీ లేదన్నారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించకుంటే మరో పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు రాజేందర్ సీఐటీయూ నాయకులు మానుకు తో పాటు ఇతరులు పాల్గొన్నారు.