జనం న్యూస్ 11 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం వద్ద సెల్ఫ్ ఏక్సిడెంట్ కు గురై, తీవ్రంగా గాయపడిన వ్యక్తిని విజయనగరం ఆర్మ్డ్ రిజర్వులో డీఎస్పీగా పని చేస్తున్న ఈ.కోటిరెడ్డి డిసెంబరు 10న సపర్యలు చేసి, 108 అంబులెన్స్ కు ఫోను చేసి, అంబులెన్స్ లో విజయనగరం మహారాజ ఆసుపత్రికి తరలించారు.వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం ఆర్మ్డ్ రిజర్వులో డీఎస్పీగా పని చేస్తున్న ఈ.కోటిరెడ్డి డిసెంబరు 10న విధుల్లో భాగంగా గంట్యాడ మండలం రామవరం వైపుగా వెళ్ళారు. తిరిగే వచ్చే క్రమంలో బైకుపై విజయనగరం నుండి వస్తున్న వ్యక్తి సెల్ఫ్ ఏక్సిడెంట్ గురై, రహదారిపై పడిపోవడంతో, తీవ్రంగా గాయపడినట్లుగా గమనించారు. వెంటనే, ఎఆర్ డీఎస్పీ తన వాహనాన్ని ఆపి, గాయపడిన వ్యక్తికి సపర్యలు చేసి, మంచినీరు అందించి, 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. 108 వాహనం వచ్చిన తరువాత క్షతగాత్రుడిని స్థానికుల సహకారంతో అంబులెన్స్ లోకి స్వయంగా ఎక్కించి, విజయనగరం మహారాజ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు, బంధువులు ఎఆర్ డీఎస్పీ ఈ.కోటిరెడ్డి అందించిన సేవలు పట్ల కృతజ్ఞతలు తెలపడంతోపాటు, అభినందనలు తెలిపారు.


