Listen to this article

సాఫీగా కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ పి. ప్రావీణ్య

జనం న్యూస్ డిసెంబర్ 11 సంగారెడ్డి,జిల్లాలో

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7.00 గంటలకు కట్టుదిట్టమైన భద్రతా, పరిపాలన ఏర్పాట్ల నడుమ ప్రారంభమైంది. చలి తీవ్రతను లెక్క చేయకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పలు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి నిలబడటంతో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య తాళ్లపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పోలింగ్ బూత్‌లోని ఓటర్ కంపార్ట్మెంట్, బ్యాలెట్ బాక్స్ సీల్, పోలింగ్ ఏజెంట్ల హాజరు, క్యూలైన్ నిర్వహణ, వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.