Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా

.నందలూరు : ఆవుల యజమానులు ఆవులను ఇష్టానుసారంగా రోడ్లపై వదిలితే కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్సై మల్లికార్జున రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఆవుల వల్ల వాహనదారులు ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇందు వల్ల ప్రజలతోపాటు ఆవులు ప్రమాదాలకు గురవుతున్నాయని అన్నారు. బుధవారం రాత్రి బస్టాండ్ కూడల్లో ఒక ఆవు లారీ కిందపడి తీవ్రంగా గాయ పడిందని అని తెలిపారు. కావున యజ మానులు ఆవులను తమ ఇళ్లకు తీసుకువెళ్లక పోతే ఈనెల 15వ తేదీన మొత్తం ఆవులను గోశాలకు తరలిస్తామని తెలియజేశారు.