తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 11 డిసెంబర్
జహీరాబాద్ నియోజకవర్గం జహీరాబాద్ మండల్ శెఖపుర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా శెట్టి నర్సింలు బరిలో నిలుస్తుండడంతో గ్రామంలోవి రాజకీయ వేడి మరింతగా పెరిగింది. నర్సింలుకు ఐక్యమత్యంగా మద్దతు తెలుపుతూ నేతలైన ఎన్. గిరిధర్ రెడ్డి, ఉజ్వల్ రెడ్డి, ఇమాం పటేల్ ఆధ్వర్యంలో ఈరోజు భారీ స్థాయిలో రోడ్‌షో నిర్వహించారు.గ్రామంలోని ప్రధాన వీధులన్నింటిలోనూ నిర్వహించిన ఈ రోడ్‌షోకు స్థానిక మహిళలు, యువత, పెద్దలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. నర్సింలు అభ్యర్థి గెలుపు ఖాయం చేయాలని, అభివృద్ధి పరంపర కొనసాగించాలంటూ నాయకులు పిలుపునిచ్చారు.శెఖపూర్ గ్రామ అభివృద్ధి కోసం నర్సింలు సరైన అభ్యర్థి అని, గ్రామ ప్రజలు విశ్వాసంతో ముందుకు రావాలని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. గ్రామంలో ఎన్నికల ప్రచారం వేగం పెరిగిన నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలు హోరాహోరిగా సాగుతున్నాయి.


