Listen to this article

.జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 11ప్రకాశం జిల్లా

తర్లుపాడు మండలం సీతానాగులవరం గ్రామంలో బుధవారం నాడు కూటమి ప్రభుత్వం నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్నదాతలైన రైతుల అభివృద్ధి, సంక్షేమమే తమ కూటమి ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు.రైతు సంక్షేమమే ప్రధాన ద్యేయం అని రైతులు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అందుకోసమే కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.రైతులకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలను పారదర్శకంగా, పూర్తిస్థాయిలో అమలు చేసి, వారి కష్టాలను తీరుస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏడిఏ బాలాజీ నాయక్ ఏఓ జ్యోష్ణ దేవి మాజీ జడ్పిటిసి రావి బాషా పతి రెడ్డి,మాజీ ఎంపీపీ ఏసుదాసు,టిడిపి నాయకులు కంచర్ల కాశయ్య, పుచ్చనూతల గోపినాధ్, బోగినేని చిరంజీవి, సోమయ్య టిడిపి నాయకులు ఈర్ల వెంకటయ్య,మేకల అచ్చిరెడ్డి, తంగిరాల అనిల్,గుర్రపుశాల నరసింహ, రోశప్పనాయుడు, కందుల చిట్టిబాబు, బొంబాయి వలి,తదితరులు పాల్గొన్నారు