Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు మండలం – రాజంపేట నియోజకవర్గం.మత్స్య కారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పథకం ప్రవేశ పెట్టిందని,ఇది మత్స్య ఎంతో ఉపయోగపడు తుందని తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజుతెలియ జేశారు గురువారం నాడు నందలూరు మండలం కోనాపురం సోమశిల బ్యాక్ వాటర్ నందు పర్యటిస్తూ మత్స్యశాఖ అధికారులు మరియు పార్టీ ముఖ్య నాయకులతో కలసి చమర్తి చెరువులో చేప పిల్లలను వదిలారు.ఈ సందర్భంగా చమర్తి జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ చేపల పెంపకం ద్వారా మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వంఈపథకాన్నితీసుకొచ్చిందన్నారు.అదేవిధంగా మత్స్యకారుల ఉపాధినిమెరుగుపరిచి,వారిని ఆర్థికంగా మెరుగుపరిచే లక్ష్యంతో నాణ్యమైన చేప పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు.చేప పిల్లల పెంపకాన్ని పక్కాగా పర్య వేక్షించాలని,నిర్లక్ష్యం వహించ వద్దని సంబంధిత అధికారులను చమర్తి జగన్ మోహన్ రాజుఆదే శించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీముఖ్య నాయకులు,మత్స్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.