జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని రాజంపేట జిల్లా కేంద్ర సాధన సమితి (JAC) ఆధ్వర్యంలో 2వ రోజు “రిలే నిరాహారదీక్ష” చేస్తున్న వారికి సంఘీభావం తెలిపి అభినందించిన.రాజంపేట జనసేన పార్టీ నాయకులు & మాజీ జెడ్పిటిసి యల్లటూరు శివరామరాజు ఆయన వెంట మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, నీటి సంఘం అధ్యక్షుడు నారదాసు రామచంద్ర, విశ్రాంత పోలీసు అధికారి పూల లక్ష్మీ నరసయ్య, గూడూరు శ్రీనివాసరాజు, మౌలా, చింతల శివ & స్థానిక జనసేన నాయకులు.ఈ ఉద్యమానికి & రాజంపేట, కోడూరు నియోజకవర్గాలలోని అన్ని మండలాలలో గ్రామాలలో జరిగే నిరసన కార్యక్రమాలకు, నిరాహార దీక్షలకు పూర్తి మద్దతు ప్రకటించిన రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు


