జనం న్యూస్ జగిత్యాల జిల్లా డిసెంబర్ 11 బీర్పూర్
మండలంలోని కండ్లపెల్లి గ్రామపంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బలపరిచిన అభ్యర్థిగా దోసరపు సుగుణ . శ్రీనివాస్ గురువారం రోజున ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తానని అలాగే బ్యాట్ గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కండ్లపల్లి ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడమే లక్ష్యంగా అలాగే డ్రైనేజీ వ్యవస్థ వీధిలైట్లు అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ముందుకు పోతానని అన్నారు. నాకే గూడెంలో సి సి రోడ్డు నిర్మాణం ఇందిరమ్మ ఇల్లు. ప్రతి కాలనీకి సిసి రోడ్డు డ్రైనేజీ నిర్మాణం. మన గ్రామంలో యూత్ కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చెస్తానాని ప్రతి అర్హులైన వారందరికీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సహకారం తో పెన్షన్ ఇప్పిస్తానని ఏ సమస్య ఉన్న నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ఐదు సంవత్సరాలు ఒక సేవకుడిలా పని చేస్తానని అన్నారు


