జనం న్యూస్ డిసెంబర్ 11 బీరు పూర్ మండలం
లోని కండ్లపెల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గంగదరి నిరోజ సంతోష్ ప్రచారం జోరుగా సాగుతుంది. గురువారం కండ్లపెల్లి గ్రామంలోని పలు వార్డుల్లో ఉంగరం గుర్తు కే ఓటు వేసి గెలిపించాలని ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. గ్రామ ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా భావిస్తానని సర్పంచ్ అభ్యర్థి గంగదరి నిరోజ సంతోష్ అన్నారు.తనకు సర్పంచ్ గా ప్రజలు అవకాశం కల్పిస్తే గ్రామంలో వాడు వార్డులో బురద లేకుండా చేస్తా తాగునీరు అందిస్తా వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన ఏకైక లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆయన అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


