Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 11 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గెలిచిన అభ్యర్థులు ఎటువంటి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడానికి వీలులేదని కాజీపేట ACP పింగిలి ప్రశాంత్ రెడ్డి, చెప్పారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ర్యాలీలు, సమావేశాలు నిర్వహించద్దని సూచించారు. దీన్ని అతిక్రమించి ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చట్టానికి లోబడి ఉండాలని సూచించారు.