జుక్కల్ డిసెంబర్ 11 జనం న్యూస్
స్థానిక పంచాయతీ ఎన్నికల ప్రచారం వేడిగా సాగుతున్న నేపధ్యంలో, జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే గారు పిట్లం మండలం లోని పలు గ్రామాలు సందర్శించి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి గ్రామంలోనూ ఆయనకు గ్రామ ప్రజలు ప్రేమతో, ఉత్సాహంతో ఘన స్వాగతం పలకడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.గ్రామ ప్రజల సందడిని చూసి హన్మంత్ షిండే ప్రజలకు ఉద్దేశించి మాట్లాడుతూ—“కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను నమ్మకండి”ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే అని, ఇప్పటికే రెండు సంవత్సరాలు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క అభివృద్ధి పనిని కూడా చేయకపోవడం బాధాకరం అని అన్నారు. ప్రజలు ఆశించిన పథకాలు, సంక్షేమం, అభివృద్ధి అన్నీ మాటలకే పరిమితమైపోయాయని విమర్శించారు.BRS అభ్యర్థులకు భారీ మెజారిటీతో మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తిపిట్లం మండలంలోని ప్రతి గ్రామం లో BRS పార్టీ బలపరిచిన అభ్యర్థులు ప్రజల సమస్యలు అర్థం చేసుకునే నాయకులని, గ్రామ అభివృద్ధిని తెచ్చేది కేవలం బి ఆర్ యస్ పార్టీనే అని ఆయన స్పష్టం చేశారు.ఈ ఎన్నికల్లో గ్రామ అభివృద్ధిని కోరుకుంటే BRS అభ్యర్థులను ఘన మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు హన్మంత్ షిండే కోరారు.పిట్లంలో జరిగిన ఈ ప్రచారం కార్యక్రమాలు ఉత్సాహంగా, ప్రజల్లో విశేష స్పందనతో సాగాయి. స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




