Listen to this article

జనం న్యూస్ 04 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం జిల్లాకు ప్రభుత్వ క్యాన్సర్‌ ఆసుపత్రి మంజూరు చేయాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షులు భీశెట్టి బాబ్జి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పట్టణంలోని పెద్ద చెరువు గట్టు వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి సోమవారం నివాళులు అర్పించి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వేదిక సభ్యులంతా ప్లకార్డులు పట్టుకొని మౌన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో పౌర వేదిక సభ్యులు పాల్గొన్నారు.