జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా
.రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతు గుంట రమేష్ నాయుడు రాజంపేట జిల్లా కేంద్రంగా చేయాలని బుధవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కి వినతి పత్రం అందజేశారుఈసందర్భంగా,ముఖ్యమంత్రి,సానుకూలంగా స్పందించడం జరిగింది. అన్నమయ్య జిల్లా రాయచోటికి రైల్వే కోడూరు కి మధ్యలో ఉన్న ప్రాంతం రాజంపేట అని రాజంపేట ఇప్పటికే రైలు కనెక్టివిటీ రోడ్డు కనెక్టివిటీ మంచినీటి సౌకర్యం ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించు కోవడానికి కావలసినంత ప్రభుత్వ భూములు నగరం నడిబొడ్డున కలదు అలాగే మంచిప్రశాంతమైన,వాతావరణం ఉన్న కారణం రెండు అసెంబ్లీలకు మధ్యంలో ఉన్న కారణంగా రాజంపేట జిల్లా కేంద్రంగా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి వివరించి వినతిపత్రం అందజేశారు,.


