Listen to this article

జనం న్యూస్‌ 12 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

విజయనగరం జిల్లాలోని వివిధ న్యాయ స్థానాల్లో ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బంది అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ డిసెంబర్ 10న ఆదేశించారు.జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎన్ మాట్లాడుతూ ఈ నెల 13న జిల్లాలోని వివిధ న్యాయ స్థానాల్లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారం (రాజీ) అయ్యే విధంగా సంబంధిత పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. పోలీసు స్టేషను పరిధిలో నమోదైన కేసుల్లో ఇరు వర్గాలు రాజీ అయ్యేందుకు అవకాశం ఉన్న కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, చిన్న క్రిమినల్ కేసులు, ట్రాఫిక్ కేసులు, ఎక్సైజ్, రోడ్డు ప్రమాద కేసులు, పెండింగ్ ఈ చలాన్లు మరియు ఇతర కాంపౌండు కేసులను ముందుగా గుర్తించాలన్నారు. ఆయా కేసుల్లో ఇరు వర్గాలతో సంప్రదించి, సమావేశాలు నిర్వహించి, వారు రాజీ అయ్యే విధంగా మానవతా దృక్పదంతో వ్యవహరించాలన్నారు. ఇందుకుగాను పోలీసు స్టేషను స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ రోజూ లోక్ అదాలతో పరిష్కారమయ్యే కేసులను సంబంధిత అధికారులను పర్యవేక్షించాలని, లోక్ అదాలత్ విజయ వంతం అయ్యేందు అధికారులు, సిబ్బంది ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. కేసుల్లోని ఇరు వర్గాలపై ఒత్తిడి లేకుండా, సహకారాత్మక వాతావరణంలో రాజీ అయ్యేలా వారిని ప్రోత్సహించాలన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తే కేసులు త్వరగా, సానుకూలంగా రాజీ అయ్యే అవకాశాలు పెరుగుతాయన్నారు. ఎక్కువ కేసులు లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే విధంగా చర్యలు చేపట్టడం వలన న్యాయ వ్యవస్థపై భారం తగ్గి, బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని జిల్లా ఎస్పీ ఎ. ఆర్. దామోదర్ అన్నారు.లోక్ అదాలత్ లో పరిష్కారమయ్యే కేసులను ప్రతీ రోజూ ఆయా సబ్ డివిజన్లుకు చెందిన డిఎస్పీలు, సీఐలు పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అధికారులను ఆదేశించారు.