Listen to this article

జనం న్యూస్ //ఫిబ్రవరి //4//జమ్మికుంట //కుమార్ యాదవ్..
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రైవేట్ పిల్లల ఆసుపత్రిలో సోమవారం రాత్రి 10 నెలల చిన్నారి మృతి చెందింది. వివరాల్లో వెళితే
మొగులపల్లి మండలం పోతుగల్లు గ్రామానికి చెందిన అయితు సతీష్ పోతుగల్ తను అంటున్న ఊర్లోనే కిరాణం షాప్ పెట్టుకొని జీవిస్తున్నాడు. తన కుమార్తె అయిన శనివారం రోజున 20 నెలల పాప జ్వరం వచ్చిందని జమ్మికుంట పట్టణంలోని సహచర పిల్లల ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. శనివారం రోజు వరకు హాస్పటల్లో వైద్య పరీక్ష నిర్వహించి తగు చికిత్స చేసి సిరప్ ఇచ్చినాక ఇంటికి పంపియడం జరిగింది. సోమవారం రోజున సాయంత్రం సిరప్ తాగిన నుండి మత్తులో ఉండడం చూసి తండ్రి సాయంత్రం 8 గంటలకు జమ్మికుంట పట్టణంలోని సహచర హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది. హాస్పిటల్ తీసుకొచ్చిన సందర్భంలో ఆ పాపని వైద్యుడు తిరుపతయ్య వైద్యం అందించడానికి సిద్ధపడిన వైద్యుడు పాప ఇక్కడికి రాకముందే మార్గమధ్యలో లేక ఇంటి వద్దను చనిపోవడం జరిగిందని, ఆస్పత్రికి తీసుకువచ్చిన పాపకు సిపిఆర్ చేసి ప్రయత్నించిన లాభం లేకపోవడంతో పాప చనిపోయిందని వైద్యుడు నిర్ధారించాడు. కాగా తల్లిదండ్రులు మాత్రం వైద్యులు ఇచ్చినటువంటి సిరుపుల వల్లే మా పాప చనిపోయిందని పాపను పట్టుకొని ఏడుస్తూ మా 20 నెలల పాప ఇప్పటివరకు మామూలు జ్వరం తప్ప ఎంతో చురుకుగా బలంగా ఉండేదని డాక్టర్ రాసినటువంటి సిరపులు పోసినప్పటినుండి మత్తుగా ఉండి , నిరసించి పోతున్నట్టుగా గమనించి ఆమెను లేపే ప్రయత్నం చేయగా లేవకపోవడంతో ఆస్పత్రికి తీసుకురావడం జరిగిందనీ మా పాప మరణానికి కారణం వైద్యుడు తిరుపతయ్యేనని పాప తల్లిదండ్రులు అన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది ఆస్పత్రికి రాగా పాప మరణించిన సంగతిని అడిగి తెలుసుకున్న పట్టణ సీఐ రవి వివరణ కోరగా మా పాప మరణానికి కారణమైన ఈ ఆసుపత్రికి ఎవరు కూడా రావద్దని తెలియజెప్పడానికి తప్ప ఆసుపత్రి నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించడం లేదని సీఐ కి తెలిపారు. వివరాలు తెలుసుకున్న పట్టణ సీఐ పాప తల్లిదండ్రులను పాప మృతదేహాన్ని అక్కడినుండి పంపించడం జరిగింది.