జనం న్యూస్ డిసెంబర్ 12 పదవి కోసం కాంగ్రెస్ పార్టీ
తరఫున కేతావత్ గోవింద్ నాయక్ (సన్నాఫ్ లక్ష్మణ్ నాయక్) బరిలోకి దిగారు. గ్రామ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, తండా ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు తాను కట్టుబడి ఉన్నానని గోవింద్ నాయక్ తెలిపారు.ప్రాథమిక సౌకర్యాల విస్తరణ, తాగునీటి సమస్యల పరిష్కారం, రహదారి సదుపాయాల మెరుగుదల, గ్రామంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి పలు అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు సాగుతానని ఆయన వెల్లడించారు.గ్రామస్థులు గోవింద్ నాయక్‌కు మంచి మద్దతు తెలియజేస్తున్నారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గోవింద్ నాయక్ విజయాన్ని సాధించాలని స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు.



