Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 12జహీరాబాద్

నియోజకవర్గంలోని జరా సంఘం మండలంలో ఉన్న చిలమామిడి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేడి మొదలైంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎర్రోళ్ల జీవరత్నం సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సేవే ధ్యేయంగా ముందుకు సాగుతున్న జీవరత్నం, గ్రామ ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న యువ నాయకుడిగా నిలుస్తున్నారు.గ్రామంలో తాగునీరు, రోడ్ల అభివృద్ధి, కాలువలు, పేదల సంక్షేమ పథకాల అమలు, మహిళా శక్తి కల్పన వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని ప్రజల ఆశీస్సులు పొందేందుకు కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, గ్రామ పెద్దలు, యువత ఆయనకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు.సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించి చిలమామిడిని అభివృద్ధి మార్గంలో నడిపించడం తన లక్ష్యమని జీవరత్నం . గ్రామ ప్రజల ఆదరణతో చిలమామిడిలో ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారుతోంది.